
పట్టు సాగులో ఆధునికత అవసరం
సెంట్రల్ సిల్క్ బోర్డు శాస్త్రవేత్తలు
చిన్నకోడూరు(సిద్దిపేట): పట్టు సాగులో ఆధునికతను అందిపుచ్చుకుని, నూతన టెక్నాలజీని వినియోగించాలని సెంట్రల్ స్కిల్ బోర్డు శాస్త్రవేత్తలు వినోద్ కుమార్, రాఘవేంద్రలు తెలిపారు. పట్టు రైతుల అభివృద్ధి కోసం సెంట్రల్ సిల్క్ బోర్డు ఆదేశాలతో మంగళవారం మండల పరిధిలోని చంద్లాపూర్, జక్కాపూర్ గ్రామాల్లో బేస్‌లైన్ సర్వే చేశారు. వారు మాట్లాడుతూ బేస్‌లైన్ సర్వేకు సిద్దిపేట, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాలు ఎంపికయ్యాయన్నారు. పట్టు సాగులో మెలకువలపై రైతులతో చర్చించారు. అధిక ఆదాయం ఉన్న ఈ సాగులోకి రైతులను ఎలా ప్రోత్సహించాలన్న విషయాలపై చర్చించారు.