
ప్లాస్టిక్ వినియోగాన్ని అరికడదాం
జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి
దుబ్బాకటౌన్: గ్రామాలలో ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలని జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి అన్నారు. శనివారం రాయపోల్ మండలం అనాజీపూర్, రాయపోల్ గ్రామ పంచాయతీలు, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామం, ప్రధాన రహదారి వెంట ఉన్న మురుగు కాలువలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం తగదని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు పంచాయతీ కార్యదర్శిలను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల విధులు నిర్వ హణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చ రించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బాల య్య, ఎంపీఓ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ ముత్తాలీఫ్, పంచాయతీ కార్యదర్శులు తదితరులున్నారు.