
పెండింగ్ కేసులు పరిష్కరించండి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి
సిద్దిపేటకమాన్: చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో శనివారం కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కేసుల పరిష్కారంలో ముందు వరుసలో ఉండే విధంగా న్యాయ, పోలీసు అధికారులు పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, జిల్లా అదనపు న్యాయమూర్తి జయప్రసాద్, జూనియర్ సివిల్ జడ్జి రేవతి, సీపీ అనురాధ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తదితరులు పాల్గొన్నారు.