
– గన్నె తిరుపతి రెడ్డి, దుబ్బాక / రాంచర్ల వేణుగోపాల్ ర
గోరింట సంబురం
హుస్నాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం మహిళలు గోరింటాకు సంబురాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సతీమణి మంజుల, తల్లి మల్లవ్వతో పాటు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. గోరింటాకు పెట్టుకుంటే వేడి తగ్గించడమే కాకుండా, చర్మ వాధులు దూరమవుతాయని నమ్మకం. కార్యక్రమంలో మెప్మా ఏడీఎంసీ సంతోషి, మాజీ కౌన్సిలర్లు చిత్తారి పద్మ, సరోజని, దండి లక్ష్మి, మెప్మా ఆర్పీలు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు. అలాగే గజ్వేల్ పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాలలోనూ గోరింటాకు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ కమలా క్రిస్టియాన, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. – హుస్నాబాద్
8లో