
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
సిద్దిపేటరూరల్: ‘పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత.. ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలి’ అని కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా అధికారులు, సిబ్బందితో కలిసి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీపీఓ దేవకీదేవి, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ హైమావతి
కలెక్టర్ ప్రాంగణంలో వన మహోత్సవం