
ప్లాస్టిక్ బాటిళ్ళతో డ్రై హెలి
మున్సిపల్ సిబ్బంది సరికొత్త ఆవిష్కరణ
హుస్నాబాద్: మున్సిపల్ సిబ్బంది సరికొత్త ఆవిష్కరణకు పదను పెట్టారు. ఖాళీ బాటిళ్లతో చెత్తను సేకరించే హెలికాప్టర్ ఆకారంలో డ్రై హెలి వాహనాన్ని తయారు చేసి ఔరా అనిపించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై ప్రజలకు అవగాహన కలిగించేందుకు డ్రై హెలి (పొడి చెత్తను సేకరించే వాహనం) వాహనాన్ని రూపకల్పన చేశారు. శుక్రవారం పట్టణంలో ఈ వాహనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. డీఆర్‌సీసీ కేంద్రం నుంచి గ్రీన్ కలర్ 732 ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించారు. హెలికాప్టర్ ఆకారంలో బాటిళ్లను వరుస క్రమంలో అతికించారు. తొపుడు బండిపై ఈ వాహనాన్ని అమర్చారు. ఇంట్లో వాడకం లేని సీలింగ్ ఫ్యాన్, పనికి రాని కూలర్ ఫ్యాన్‌ను అమర్చారు. రెండు వైపులా రేకుతో తయారు చేసిన డోర్లు ఏర్పాటు చేశారు. ఈ వాహనంతో ప్రతి వార్డులో ఇంటింటికి తిరిగి సింగిల్ యూస్ ఫ్లాస్టిక్‌ను తీసుకొని జ్యూట్ బ్యాగులు ఇచ్చి ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. మున్సిపల్ సిబ్బంది గతంలో ఖాళీ బాటిళ్లతో పడవ ను తయారు చేయగా, ప్రస్తుతం డ్రై హెలి వాహనాన్ని రూపకల్పన చేయడంపై మంత్రి అభినందించారు.