
నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
మిరుదొడ్డి(దుబ్బాక): నైపుణ్యాలు పెంపొందించుకున్నప్పుడే సమాజంలో గుర్తింపు లభిస్తుందని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అర్చన ప్రియదర్శిణి అన్నారు. మంగళవారం స్థానిక మోడల్ స్కూల్‌లో ప్రపంచ నైపుణ్యాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు స్వతహాగా తయారుచేసిన పలు ఎగ్జిబిట్లు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ కోసం సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. శాసీ్త్రయ అంశాల నుంచి సృజనాత్మకత, పర్యావరణ, డిజిటల్ పరిజ్ఞానం, వినూత్న ఆవిష్కరణల వరకు వివిధ అంశాలలో విద్యార్థులు రాణించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.