
ట్రేడ్‌లైసెన్స్‌ల జారీలో అలసత్వం తగదు
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ హైమావతి ● అధికారులతో సమావేశం
కొలువుదీరిన కొండపోచమ్మ పాలకవర్గం
వేగంగా ఇంజనీరింగ్ కాలేజీ రోడ్డు పనులు
మున్సిపల్ కమిషనర్ రమేశ్‌కుమార్
సిద్దిపేటరూరల్: ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా, మండల స్థాయి మెడికల్ అధికారులతో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు అన్ని ఆస్పత్రులలో మందులు అందుబాటులో ఉంచాలన్నారు. గురుకులాలు, వసతి గృహాలలో విద్యార్థులకు హిమోగ్లోబిన్ శాతం, పలు పరీక్షలు నిర్వహించి జాగ్రత్తగా చూడాలన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోనీ ఆయా వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగంగా జరిగేలా మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
జగదేవ్‌పూర్(గజ్వేల్): రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన కొండపోచమ్మ ఆలయంలో గురువారం నూతన పాలకవర్గం కొలువు దీరింది. ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. కమిటీ సభ్యులుగా అనుగీత, రాజు, వెంకట్రాంరెడ్డి, కిషన్, రాజు, దేవేందర్‌రెడ్డి, అనసూర్య, నర్సింహులు, జనార్దన్‌రెడ్డి, లక్ష్మణ్, ఆగమల్లు, ఆశయ్య, వజ్రమ్మ, నరేష్‌లను దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మీ, ఈఓ రవికుమార్‌లు ప్రమాణం చేయించారు. అనంతరం అనుగీతను చైర్‌పర్సన్‌ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన చైర్‌పర్సన్‌ను మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అభినందిస్తూ సన్మానించారు. అలాగే కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్‌రావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి నూతన చైర్‌పర్సన్‌ను, కమిటీ సభ్యులను అభినందించి అమ్మవారిని దర్శించుకున్నారు.
హుస్నాబాద్‌రూరల్: ఇంజనీరింగ్ కాలేజీని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ప్రారంభిస్తామని చెప్పిన అధికారులు ఆ దిశగా రోడ్డు పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. గురువారం డీఈ మహేశ్ సీసీ రోడ్డు పనుల నాణ్యతను పరిశీలించారు. పాలిటెక్నిక్ వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి ఈజీఎస్‌లో రూ.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించడంతో అధికారులు దగ్గరుండి చేయిస్తున్నారు. మరో రెండు రోజుల్లో రోడ్డు పనులు పూర్తికానున్నట్లు తెలుస్తోంది.
దుబ్బాక: మున్సిపాలిటీలో వ్యాపార సముదాయాలకు సంబంధించి ట్రేడ్ లైసెన్స్‌ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, అలసత్వం తగదని కమిషనర్ రమేశ్‌కుమార్ సిబ్బందికి సూచించారు. గురువారం ట్రేడ్‌లైసెన్స్‌ల జారీ, భువన్ యాప్‌లో వివరాల నమోదును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ భువన్‌యాప్‌లో ఆస్తుల సమాచారాన్ని నమోదు, మ్యాపింగ్ చేయడం, పన్నుల వసూలుకు అవసరమైన వివరాల నమోదు పారదర్శకంగా చేపట్టాలన్నారు. అలాగే మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల సమక్షంలో కొలతలు వేసి ముగ్గులు పోసే కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు.

ట్రేడ్‌లైసెన్స్‌ల జారీలో అలసత్వం తగదు

ట్రేడ్‌లైసెన్స్‌ల జారీలో అలసత్వం తగదు