సివిల్‌ జడ్జి కోర్టును ఏర్పాటు చేయండి | - | Sakshi
Sakshi News home page

సివిల్‌ జడ్జి కోర్టును ఏర్పాటు చేయండి

Jul 11 2025 12:50 PM | Updated on Jul 11 2025 12:50 PM

సివిల

సివిల్‌ జడ్జి కోర్టును ఏర్పాటు చేయండి

మంత్రి పొన్నంను కలిసిన న్యాయవాదులు

హుస్నాబాద్‌: పట్టణంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో మంత్రుల నివాస గృహంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను హుస్నాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు మంజూరుకు కృషి చేయాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యాళ్ల శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఒగ్గొజు సదానందం, మాజీ ఏజీపీ కన్నోజు రామకృష్ణ, సీనియర్‌ న్యాయవాదులు ఉన్నారు.

మహిళలు ఆర్థికాభ్యున్నతి సాధించాలి

జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ ప్రకాశ్‌

వర్గల్‌(గజ్వేల్‌): ఇందిరా మహిళాశక్తి పథకం తోడుగా స్వయంసహాయక సంఘ మహిళలు ఆర్థికాభ్యున్నతి సాధించాలని సెర్ప్‌ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ ప్రకాశ్‌ అన్నారు. గురువారం వర్గల్‌ మండల కేంద్రంలో ఇందిరా మహిళాశక్తి సంబరాలలో పాల్గొన్నారు. ప్రభుత్వం మహిళాభ్యున్నతికి అమలుచేస్తున్న వివిధ పథకాలపై ఆయన అవగాహన కల్పించారు. వడ్డీలేని రుణాల గురించి వివరించారు. సంఘంలో సభ్యురాలిగా ప్రతి మహిళ చేరేలా, రుణాలు తీసుకుని జీవనోపాధులు కల్పించుకునేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎం ఆనంద్‌, సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, సీసీలు, ఎస్‌హెచ్‌జీ మహిళలు పాల్గొన్నారు.

మెనూ ప్రకారం

భోజనం వడ్డించాలి

డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): ప్రభుత్వ పాఠశాలల్లో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని తిగుల్‌నర్సాపూర్‌, గొల్లపల్లి గ్రామాల్లో పాఠశాలలను సందర్శించారు. అలాగే జగదేవ్‌పూర్‌లో ఆదర్శ పాఠశాలను, హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆర్థమ య్యే విధంగా బోధన చేయాలని, గ్రూపులుగా విభజించి విద్యను అందించాలన్నారు.

రెవెన్యూ డివిజన్‌

సాధించితీరుతాం

16న జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం

చేర్యాల(సిద్దిపేట):రెవెన్యూ డివిజన్‌ సాధించి తీరుతామని, ఈ నెల 16న స్థానిక అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మానవహారం నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్‌ వకుళాభరణం నర్సయ్యపంతులు తెలిపారు. గురువారం పట్టణ కేంద్రంలో జేఏసీ, అఖిల పక్షం ప్రతినిధులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. పలువురు మాట్లాడుతూ మానవహారం కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సివిల్‌ జడ్జి కోర్టును ఏర్పాటు చేయండి 1
1/2

సివిల్‌ జడ్జి కోర్టును ఏర్పాటు చేయండి

సివిల్‌ జడ్జి కోర్టును ఏర్పాటు చేయండి 2
2/2

సివిల్‌ జడ్జి కోర్టును ఏర్పాటు చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement