
బీజేపీలోకి గాడిపల్లి భాస్కర్
● అనుచరులతో కలిసి కాషాయ తీర్థం ● రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో చేరికలు
గజ్వేల్: మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మెదక్ ఎంపీ రఘునందన్‌రావుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు పట్టణంలోని మాజీ కౌన్సిలర్లు సుభాష్‌చంద్రబోస్, రామచంద్రాచారి, నర్సింహులు, రొట్టెల దాసు, పద్మశాలి సంఘం అధ్యక్షులు దేవులపల్లి రాజారాంలతోపాటు భాస్కర్ అనుచరులు బీజేపీలో చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ గజ్వేల్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఎంపీ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఇదిలావుంటే భాస్కర్ బీజేపీలో చేరడంతో పట్టణంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.