మురుగును పారదోల్తాం | - | Sakshi
Sakshi News home page

మురుగును పారదోల్తాం

Jul 11 2025 12:50 PM | Updated on Jul 11 2025 12:50 PM

మురుగ

మురుగును పారదోల్తాం

హుస్నాబాద్‌: ‘డ్రైనేజీల ద్వారా వెళ్లే మురుగు నీటిని మళ్లిస్తాం. అవసరం ఉన్న చోట ఎఫ్‌ఎస్‌టీపీ కేంద్రాలను నిర్మిస్తాం. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తాం’ అని మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌ తెలిపారు. గురువారం పట్టణంలో నెలకొన్న సమస్యల పై ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఒక్కొక్కటిగా నోట్‌ చేసుకొని సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా ఖాళీ ప్లాట్లల్లో నీరు నిలవడం, రహదారులు, మురికి కాలువల నిర్మాణాలు, దోమల నివారణ, పందులు, కోతుల బెడద వంటి పలు సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కాల్‌ చేసి విన్నవించారు. ఫీల్డ్‌ విజిట్‌ చేసి సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్‌ వివరించారు.

ఇంటి పన్నులు అధికంగా పెంచారు. రూ.7 వేలు ఉన్న ఇంటి పన్నును రూ.35 వేలు పెంచి నోటీస్‌ ఇచ్చారు. పెద్ద మొత్తంలో పెంచడం సరికాదు.

పూదరి రవీందర్‌గౌడ్‌, 3వ వార్డు

● రెసిడెన్సియల్‌ పర్పస్‌లో ఇంటి అనుమతి తీసుకొని దుకాణం పెట్టి ట్రేడ్‌ లైసెన్స్‌ పొందారు. కమర్షియల్‌గా చేయడంతో పన్ను పెరిగింది.

పట్టణంలోని మల్లెచెట్టు నుంచి గాంధీ చౌరస్తా వరకు ఇరుకు రోడ్లు ఉన్నాయి. కూరగాయల దుకాణాలతో ఇబ్బందులు. చర్యలు తీసుకోండి.

అయిలేని మల్లికార్జున్‌ రెడ్డి, చంద్రారెడ్డి,

పిడిశెట్టి రాజు, హుస్నాబాద్‌

● తాత్కాలికంగా పాత తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోని ఖాళీ స్థలంలోకి కూరగాయల దుకాణాలను తరలిస్తాం.

మా కాలనీలో పందుల బెడద ఎక్కువైంది. అలాగే దోమల నివారణకు చర్యలు చేపట్టండి.

మహ్మద్‌ మొయినొద్దిన్‌, 17వ వార్డు

● ఊరు బయటకు పందులు తరలించేలా యజమానులకు సూచిస్తాం. దోమల నివారణకు మెలాథిన్‌ స్ప్రే చేయిస్తాం.

ఖాళీ ప్లాట్లన్నీ ముళ్లపొదలను తలపిస్తున్నాయి. పాములు తిరుగుతుండటంతో భయభ్రాంతులకు గురవుతున్నాం. మేకల సంపత్‌, 17వ వార్డు

● ఖాళీ ప్లాట్ల యజమానులకు ఇప్పటికే నోటీస్‌లు జారీ చేశాం. వారు స్పందించకుంటే డోజర్‌తో తామే క్లీన్‌ చేయిస్తాం.

బస్టాండ్‌ వెనుకాల గల కాలనీలో మురుగు నీరు నిలిచి దుర్వాసన వస్తోంది.

గంగిశెట్టి సత్యనారాయణ, హుస్నాబాద్‌

● నేషనల్‌ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లి మురికి కాలువ సమస్యను పరిష్కరిస్తాం.

పలు వీధుల్లో నిర్మించిన మురికి కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

వరయోగుల అనంత స్వామి, హుస్నాబాద్‌

● అక్రమ నిర్మాణాలపై విజిట్‌ చేసి నోటీస్‌లు ఇస్తాం. వినకుంటే నిర్మా ణాలను తొలగిస్తాం.

మా కాలనీలో ఇరువైపులా సీసీ రోడ్లు వేసి మధ్యలో నిలిపివేశారు. పూర్తి చేసేలా చర్యలు తీసుకోండి. తిరుపతిరెడ్డి, 2వ వార్డు

● ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి వార్డులు తిరుగుతాం. అసంపూర్తిగా ఉన్న రహదారులు, మురికి కాలువల నిర్మాణాలు పూర్తి చేస్తాం.

ప్రధాన చౌరస్తాల్లో వివిధ ప్రాంతాలు తెలిపేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయండి.

పబ్బ సాంబమూర్తి, గాంధీ చౌరస్తా

● తప్పకుండా ప్రధాన చౌరస్తాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం.

మా కాలనీలో గతుకుల రోడ్లతో ఇబ్బందులు పడుతున్నాం. చర్యలు చేపట్టండి

సంజీవరెడ్డి, రెడ్డికాలనీ, మైసయ్య 14వ వార్డు

● పెండింగ్‌ రహదారుల నిర్మాణాల కోసం ఇంజనీరింగ్‌ అధికారులతో విజిట్‌ చేస్తాం. కాంట్రాక్టర్లను పిలిపించి పనులు ప్రారంభం అయ్యేలా చూస్తాం.

ఎఫ్‌ఎస్‌టీపీ కేంద్రాలు నిర్మిస్తాం

ఖాళీ ప్లాట్ల యజమానులకు నోటీస్‌లు జారీ చేస్తాం

ఫీల్డ్‌ విజిట్‌ చేసి సమస్యలు పరిష్కరిస్తాం మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌

పట్టణంలోని మెయిన్‌ రోడ్‌ నుంచి వచ్చే మురికి నీళ్లు పొలాలకు వెళ్తున్నాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు ముంచెత్తుతున్నాయి.

పచ్చిమట్ల రవీందర్‌ గౌడ్‌, హుస్నాబాద్‌

మురికి నీటిని పట్టణం చివరి వరకు పంపించేందుకు శాశ్వత పరిష్కారం చూపుతాం. మురికి కాలువలు, ఎఫ్‌ఎస్‌టీపీ కేంద్రాల నిర్మాణం కోసం రూ.15 కోట్లతో సీడీఎంఏకు ప్రతిపాదనలు పంపాం.

పట్టణంలో కోతుల బెడద నుంచి కాపాడండి.

అయిలేని శంకర్‌ రెడ్డి, హుస్నాబాద్‌

హుస్నాబాద్‌ పట్టణంలో కోతుల బెడద ఎక్కువగా ఉంది వాస్తవమే. వాటిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

మురుగును పారదోల్తాం1
1/1

మురుగును పారదోల్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement