
మల్లన్న హుండీ ఆదాయం రూ.కోటి 4 లక్షలు
శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఖజానాకు భారీ ఆదాయం సమకూరింది. 55 రోజులలో హుండీ ద్వారా రూ.1,04,35,711ల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ అన్నపూర్ణ తెలిపారు. గురువారం ఆలయంలోని హుండీలనూ దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కానుకలను లెక్కించారు. నగదు రూ.1,04,35,711, విదేశి కరెన్సీ నోట్లు 42, మిశ్రమ బంగారం 120గ్రాములు, మిశ్రమ వెండి 6కిలోల 100గ్రాములు, పసుపు బియ్యం16క్వింటాళ్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు, ప్రధానార్చకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆలయంలో పలు కార్యక్రమాలకు వేలం పాట నిర్వహించారు.
– కొమురవెల్లి(సిద్దిపేట)