
ఓటరు జాబితా పక్కాగా ఉండాలి
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
వర్గల్(గజ్వేల్): తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా ఓటరు జాబితా తయారు చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. సోమవారం వర్గల్ మండలం గౌరారం రైతువేదికలో తహసీల్దార్ బాల్‌రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి బూత్ లెవెల్ ఆఫీసర్ల(బీఎల్‌ఓ) శిక్షణ శిబిరాన్ని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీఓ చంద్రకళ సందర్శించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరినీ ఓటరు జాబితాలో నమోదుచేయాలన్నారు. మృతుల తొలగింపు, సవరణ, కొత్త ఓటర్లు ఎలా నమోదు చేయాలి తదితర అంశాలను, వినియోగించాల్సిన ఫారాలను క్షుణ్ణంగా వివరించారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రేనర్ రామకృష్ణారెడ్డి, ఆర్‌ఐ రాజు, సహాయకుడు ఎన్ శంకర్, వెంకటేష్‌గౌడ్, వివిధ గ్రామాల బీఎల్‌ఓలు పాల్గొన్నారు.
అంజయ్య గౌడ్‌కు పురస్కారం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): భారతి సాహితీ సంస్థ కోరుట్ల ఆధ్వర్యంలో అందిస్తున్న అందె వెంకటరాజం స్మారక పురస్కారానికి సిద్దిపేటకు చెందిన అవధాని బండకాడి అంజయ్య గౌడ్ ఎంపికైనట్లు కవి ఉండ్రాళ్ళ రాజేశం తెలిపారు. కోరుట్లలోని సినారె కళాభవనంలో ఈ నెల 12న అంజయ్య గౌడ్ పురస్కారం అందుకుంటారన్నారు. పద్య సాహిత్యంలో విశేష సేవచేస్తున్న అంజయ్యగౌడ్ ఎంపిక కావడంపై పలువురు కవులు అభినందించారు.
జీఓ రద్దు చేయాల్సిందే
సిద్దిపేటఅర్బన్: పని గంటలను 8 నుంచి 10 గంటలకు పెంచుతూ తెచ్చిన జీఓ 282ను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేటలో కార్మిక సంఘాల నాయకులు జీఓ ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 29 రకాల కార్మిక చట్టాలను తిరిగి తీసుకురావడానికి కార్మిక సంఘాలు ఈనెల 9న సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో ఆయా కార్మిక సంఘాల నాయకులు గోపాలస్వామి, లక్ష్మణ్, నర్సింహులు, మల్లేశం, రవికుమార్, సంపత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దగుండవెళ్లిలో శ్రమదానం
దుబ్బాక: మండలంలోని పెద్దగుండవెళ్లిలో సోమవారం రేణుకమాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు శ్రమదానం చేశారు. ఆలయానికి వచ్చే ప్రధాన రహదారికి రెండువైపులా పెరిగిన చెట్లను తొలగించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఏల్పుల మహేశ్, పంచాయతీ కార్యదర్శి మురళి, నాయకులు యాదగిరి, బుచ్చిరెడ్డి, మాల్లారెడ్డి, కిషన్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
గిరిజన విద్యార్థినికి డాక్టరేట్
హుస్నాబాద్‌రూరల్: మండల పరిధిలోని భల్లునాయక్ తండాకు చెందిన ఆజ్మీర అరుణ వృక్షశాస్త్రం (బాటనీ)లో పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్ట రేట్ పొందారు. దీంతో గ్రామస్తులు ఆమెను అభినందించారు. ఎమ్మెస్సీ చదివిన అరుణ పీహెచ్‌డీ పూర్తి చేశారు. సోమవారం హన్మకొండ కాకతీయ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో గవర్నర్ నుంచి డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.

ఓటరు జాబితా పక్కాగా ఉండాలి

ఓటరు జాబితా పక్కాగా ఉండాలి

ఓటరు జాబితా పక్కాగా ఉండాలి