
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి
కలెక్టర్ మను చౌదరి
గజ్వేల్‌రూరల్: వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ మను చౌదరి పేర్కొన్నారు. మండల పరిధిలోని సింగాటంలోగల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం రాగానే వెంటనే ధాన్యం కొనుగోళ్లను చేపట్టడంతో పాటు ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్‌లు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. కాగా ఇప్పటి వరకు 12,342 క్వింటాళ్ల వరిధాన్యం కొనుగోలు చేసి వడ్డెపల్లిలోని శివసాయి బాలాజీ మిల్‌లో దిగుమతి చేసినట్లు సెంటర్ ఇన్‌చార్జ్‌లు కలెక్టర్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో జయదేవ్‌ఆర్య, డీఎం ప్రవీణ్, అడిషనల్ డీఆర్‌డీవో మధుసూదన్, తహసీల్దార్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.