
కరోనా పట్ల ఆందోళన వద్దు
ఆస్పత్రి సూపరింటెండెంట్ హేమరాజ్‌సింగ్
దుబ్బాక: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని దుబ్బాక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్‌సింగ్ సూచించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న కరోనా లక్షణాలు గతంలో మాదిరిగానే ఉన్నా వ్యాధి ప్రభావం అంతగా లేదన్నారు. కోవిడ్ మహమ్మారి రాకుండా ప్రజలు ముందుజాగ్రత్తగా మాస్కులతో పాటు శానిటైజర్ ఉపయోగించాలని సూచించారు. లక్షణాలు ఉంటే ప్రజలు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి రావాలన్నారు. ప్రజలు ముందుగా భయం వీడి ధైర్యంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.