
కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు
● ఎమ్మెల్యే హరీష్ రావు ● పద్మశాలి పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ
సిద్దిపేటజోన్: స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తన సొంత డబ్బులు రూ.5 లక్షలు వెచ్చించి 50 కుట్టు మిషన్లను పద్మశాలి పేద మహిళలకు ఉచితంగా పంపిణీ చేసి మాట్లాడారు. పద్మశాలీలు ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పద్మశాలీలు, చేనేత కార్మికులకు రుణమాఫీ చేశామన్నారు. సిద్దిపేట గొల్లభామ చీరలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు డాక్టర్ సతీష్, ప్రతినిధులు శ్రీనివాస్, విజయ, మల్లేశం పాల్గొన్నారు.