
మనం బుక్ ఆఫ్ రికార్డులో చోటు
దుబ్బాకరూరల్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు ఆర్మీ, ఎస్‌ఎస్‌జీడీకి ప్రిపేర్ అవుతున్నారు. ‘సైనిక వాట్సాప్’ గ్రూప్ ద్వారా 8వేల మందికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. సైనిక గ్రూప్‌కు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గంభీర్‌పూర్ గ్రామానికి చెందిన అరిగె లోకేష్ ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా అరిగె లోకేష్ మాట్లాడుతూ 2020లో ఈ గ్రూప్ ప్రారంభించినట్లు తెలిపారు. ఆర్మీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉచింతగా బుక్స్, షూస్ అందిస్తున్నామన్నారు. దీంట్లో ఇప్పటి వరకు 175 మంది ఆర్మీ, ఎస్‌ఎస్‌జీడీకి ఎంపికయ్యారని, ఇటీవల జిల్లా నుంచి ఆర్మీకి ఆరుగురు అభ్యర్థులు ఎంపికయ్యారని తెలిపారు. సేవలను గుర్తించిన మనం ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మనం బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేశారని పేర్కొన్నారు. వచ్చే నెల 11న హైదరాబాద్‌లో జరిగే త్యాగరాయ గానసభలో డాక్టరేట్ అందజేయనున్నట్లు తెలిపారు.