
మిస్ ఫొటోజెనిక్ విజేతకు సత్కారం
సిద్దిపేటరూరల్: తెలంగాణ మిస్ ఫొటోజెనిక్ విభాగంలో విజేతగా నిలిచిన తుమ్మల ఆర్తిని కలెక్టర్ మనుచౌదరి సన్మానించారు. అక్బర్‌పేట్–భూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఈ యువతి నగరంలో జరిగిన మిస్ తెలంగాణ పోటీల్లో ఫొటోజెనిక్ విభాగంలో విజేతగా నిలవడంతో కలెక్టర్ శుక్రవారం శాలువతో సత్కరించి బహుమతి అందజేశారు. భవిష్యత్తులో ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రతిభను చాటాలంటూ కలెక్టర్ ఆల్ ద బెస్ట్ తెలిపారు.
సీపీ అభినందన
సిద్దిపేటకమాన్: మిస్ ఫొటోజెనిక్ విభాగంలో విజేతగా నిలిచిన తుమ్మల ఆర్తిని సీపీ అనురాధ అభినందించారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో ఆమెను సత్కరించారు.