
కార్ల వివరాలివ్వండి
సిద్దిపేటరూరల్: సాక్షి పత్రికలో ఈనెల 3న ప్రచురితమైన ‘‘అధికార్ల దందా’’ కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. అధికారులు వినియోగిస్తున్న కార్ల వివరాలను అందించాలని కోరినట్లు కలెక్టరేట్ ఏఓ రెహమన్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని జిల్లా అధికారుల్లో కొందరు వారి సొంతవాహనాలతో పాటు, కుటుంబ సభ్యుల కార్లను వినియోగిస్తూ రూ. వేలల్లో బిల్లులు డండుకుంటున్న క్రమంలో సాక్షి పత్రికలో వివరంగా ప్రచురితమైంది. ఈమేరకు స్పందించిన జిల్లా యంత్రాంగం వారి వాహనాల పూర్తి వివరాలు సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు.