
అలైన్‌మెంట్ మార్పునకు కేంద్రం అంగీకారం
బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్
సిద్దిపేటకమాన్: జాతీయ రహదారి (365బీ) అలైన్‌మెంట్ మార్పునకు కేంద్రం అంగీకరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అలైన్‌మెంట్ మార్పు ఎంపీ రఘునందన్‌రావు విశేష కృషి ఫలితమేనని అన్నారు. పాత అలైన్‌మెంట్ ద్వారా దుద్దెడ, ఎన్సాన్‌పల్లి, తడకపల్లి, చిన్నగుండవెళ్లి, పుల్లూరు, మల్యాల గ్రామాల్లో రైతులు భూములు కోల్పోతున్నారని అన్నారు. దీంతో ఎంపీ ప్రత్యేక చొరవ తీసుకుని జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి ఉమాశంకర్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. స్పందించిన ఉమాశంకర్ ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రైతుల భూములకు ఎలాంటి నష్టం లేకుండా రాజీవ్‌రహదారి, సిద్దిపేట ఔటర్‌రింగ్‌రోడ్డుతో అనుసంధానం చేసే మార్గాన్ని ప్రతిపాదించారని తెలిపారు. కార్యక్రమంలో బాసంగారి వెంకట్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.