
సమర్థ పాలనకు కార్యదర్శులే కీలకం
సిద్దిపేటఎడ్యుకేషన్: పాలన సమర్థవంతంగా ఉండేందుకు పంచాయతీ కార్యదర్శులు ముఖ్య పాత్ర పోషించాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) దేవకీదేవి అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో శనివారం పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ.. కార్యదర్శులు శిక్షణలో నేర్చుకున్న అంశాలపై పట్టు సాధించి పంచాయతీ పాలనను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రజాప్రతినిధులకు సహకరించాలని సూచించారు. రిసోర్స్ పర్సన్‌లు రిటైర్డ్ ఎంపీడీఓ సమ్మిరెడ్డి, ఎంపీఓ శ్రీనివాసరావు, విద్యావికాస్‌రెడ్డి తదితరులు పారదర్శకత, ప్రజల భాగస్వామ్యం, స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థలు, గ్రామ సభ నిర్వహణలో కార్యదర్శి పాత్ర తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లాలోని 33 మంది పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి