కొనుగోలు కేంద్రాలలో మహిళలకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాలలో మహిళలకు ప్రాధాన్యం

Apr 20 2025 7:55 AM | Updated on Apr 20 2025 7:55 AM

కొనుగోలు కేంద్రాలలో మహిళలకు ప్రాధాన్యం

కొనుగోలు కేంద్రాలలో మహిళలకు ప్రాధాన్యం

మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపెల్లి

బెజ్జంకి(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మండలంలోని గుగ్గిల్ల, దాచారం, కల్లెపెల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన ప్రారంభించారు. అంతరం మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం బెజ్జంకి మండల పరిషత్‌ కార్యాలయంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.5.56 లక్షల చెక్కులను 18 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఆయా కార్యక్రమాలలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ డీఓ ప్రవీణ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దామోదర్‌, ఏఎంసీ చైర్మన్‌ కృష్ణ, మండల అధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి, చేప్యాల శ్రీనివాస్‌, సంతోష్‌, శ్రీకాంత్‌, కుమార్‌, నర్సయ్య, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement