ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించాలి

Jun 3 2026 6:48 AM | Updated on Jun 3 2026 6:48 AM

సంగారెడ్డి జోన్‌: ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, వస్త్ర, కాగితం సంచులు వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని అదనపు కలెక్టర్లు సంగీత, పాండు సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాల వినియోగం, ఘన, ద్రవ వ్యర్థాల వేర్వేరు సేకరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా పోస్టర్లను మంగళవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఎన్‌ విజయలక్ష్మి, పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్లు సంగీత, పాండు

Advertisement
 
Advertisement
Advertisement