హత్నూర(సంగారెడ్డి): ఎండలు తీవ్రం కావడంతో ఉపాధి కూలీలు నీటి కోసం తలడిల్లుతున్నారు. ఉపాధి కూలీలకు పని వద్ద నీటి సౌకర్యం కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్న క్షేత్రస్థాయిలో నీటి కోసం ఎండలో కూలీలు విలవిలలాడుతున్నారు. ఈ మేరకు మండలంలోని బోరుపట్ల ఉపాధి హామీ పథకం కూలీలు నీటి సౌకర్యం కల్పించడం లేదంటూ ఇంటి నుంచి తెచ్చుకున్న వాటర్ బాటిళ్లను చూపిస్తూ నిరసన తెలిపారు. అధికారులు ఎవరూ పని వద్దకు రావడంలేదని, మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిత్యం తాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.
సీఎం రేవంత్ రెడ్డి
కార్మికుల పక్షపాతి
పటాన్‌చెరు టౌన్: సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల పక్షపాతి అని ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. మంగళవారం హెఎండబ్ల్యూఎస్‌ఎస్బీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా పోటీలో చేస్తున్న రాజిరెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గౌరవిస్తూ జూన్ 1న రాష్ట్రంలోని కోటి పది లక్షల మందికి నెలకు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకూ వేతనాలు పెంచిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అన్నారు. ఈ ప్రచారంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి మతిన్, నాయకులు విజయ్ కుమార్ యువరాజ్, రవి, మహేందర్ లాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఐఐఐటీకి ఎంపిక
న్యాల్‌కల్(జహీరాబాద్): బాసరలోని ఐఐఐటీకి ఎంపికై న రేజింతల్ జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థులు పవిత్ర, భార్గవి, అబ్బు ఉస్మాన్, అక్షరలకు మంగళవారం ఘనంగా సన్మానించారు. బీఆర్‌ఎస్ నాయకుడు అరుణ్‌రెడ్డి, మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారం మేనేజర్ సునీల్ విద్యార్థులకు శాలువాలు, పూల మాలలతో సన్మానించారు.


