ప్రధానోపాధ్యాయులకు ఘన సత్కారం | - | Sakshi
Sakshi News home page

ప్రధానోపాధ్యాయులకు ఘన సత్కారం

Jun 3 2026 6:48 AM | Updated on Jun 3 2026 6:48 AM

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: వేసవి శిబిరాల్లో విశిష్ట సేవలందించిన పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మంత్రి దామోదర సత్కరించడంతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మంగళవారం సంగారెడ్డి పెరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు టీజీఐఐసీ చైర్‌ పర్సన్‌ నిర్మలారెడ్డి, కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఎస్పీ పరితోష్‌ పంకజ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, తెలంగాణ జాతీయ హరిత దళం సంయుక్త ఆద్వర్యంలో పీఎంశ్రీ పాఠశాలలో వేసవి శిబిరాలను నిర్వహించారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన, బాధ్యతను పెంపొందించేందుకు వివిధ నాటికలు, నృత్యాలు తదితర సృజనాత్మ కార్యక్రమాల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ మేరకు శిక్షణ అందించిన జెడ్పీహెచ్‌స్‌ తెల్లాపూర్‌ ప్రధానోపాధ్యాయుడు భాస్కర్‌, నారాయణఖేడ్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయుడు మన్మద కిషోర్‌, శివంపేట జెడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయుడు వేద శ్రీలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌జీసీ జిల్లా పర్యావరణ అధికారి విజయలక్ష్మి, ఇన్‌చార్జి డీఈఓ శంకర్‌, హరితదళం కో ఆర్డినేటర్‌ మాధవ రెడ్డి, జిల్లా నోడల్‌ అధికారి లింబాజి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement