అయ్యో పాపం.. | - | Sakshi
Sakshi News home page

అయ్యో పాపం..

Jun 3 2026 6:48 AM | Updated on Jun 3 2026 6:48 AM

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వాస్పత్రి సమీపంలోని పొదల్లో వదిలివెళ్లారు. ఈ ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం... స్థానిక ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన శిశువును వదిలి వెళ్లారు. శిశువు ఏడుపులు వినిపించడంతో స్థానిక మహిళ ఆ శిశువును ఇంటికి తీసుకెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వైద్య సిబ్బందికి, హద్నూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది శిశువును స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం 108లో జహీరాబాద్‌కు తరలించి ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. వారు శిశువును సంగారెడ్డిలోని శిశు విహార్‌కు తరలించారు. ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పొదల్లో మగ శిశువును వదిలివెళ్లిన

గుర్తు తెలియని వ్యక్తులు

స్థానిక ఆస్పత్రిలో చికిత్స

సంగారెడ్డిలోని శిశు విహార్‌కు తరలింపు

Advertisement
 
Advertisement
Advertisement