సంగారెడ్డి టౌన్: సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి మండలంలోని ఎమ్మెన్నార్ మెడి కల్ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా లో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ షీ టీమ్ బృందాలు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. సఖీ కేంద్రం, భరోసా కేంద్రాలు అండగా ఉంటాయని తెలిపారు. డిజిటల్ అరెస్టుల పేరు తో గుర్తుతెలియని ఫోన్ నంబర్ల నుంచి కాల్ చేసి బెదిరిస్తే, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి, డీఎస్పీ సత్తయ్య, కళాశాల ప్రిన్సిపాల్ శ్యామ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి


