చేగుంట(తూప్రాన్): ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సురక్షితమైన నీటిని తాగాలని, నీరు పారిశుద్ధ్యం, పరిశుభ్రత తెలంగాణ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ బ్రహ్మచారి పేర్కొన్నారు. బుధవారం చేగుంట ఐకేపీ కార్యాలయంలో గ్రామైక్య సంఘాల అధ్యక్షులకు స్వచ్ఛమైన నీటి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ... 150 నుంచి 500 టీడీఎస్ నాణ్యత ఉన్న నీటిని మాత్రమే తీసుకోవాలన్నారు. వివిధ గ్రామాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులు తీసుకొచ్చిన తాగునీటిని పరిశీలించి మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న నీటి నాణ్యత తగిన మోతాదులోనే ఉందన్నారు. గ్రామాల్లో బోరు బావుల నీటిని వాడుతున్నట్లయితే శుద్ధి చేసిన నీటిని తాగేందుకు, మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ బాటిళ్లలో నిలువ ఉంచిన నీటిని తాగడం కాన్సర్ కొనితెచ్చుకోవడమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు అధికారి అనిత, ఏపీఎం దుర్గాప్రసాద్, ఆయా గ్రామాల సీసీలు, గ్రామ సమైఖ్య అధ్యక్షులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.


