జనగణన నమోదులో పాల్గొనండి | - | Sakshi
Sakshi News home page

జనగణన నమోదులో పాల్గొనండి

Apr 30 2026 9:24 AM | Updated on Apr 30 2026 9:24 AM

● ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ● వివరాలు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే

● ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ● వివరాలు నమోదు చేసుకున్న ఎమ్మెల్యే

పటాన్‌చెరు: జనగణనలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. పటాన్‌చెరులోని తన నివాసంలో బుధవారం స్వీయ జనగణనను ప్రారంభించారు. తనతోపాటు తన కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...దేశాభివృద్ధికి జనగణన ఎంతో కీలకమని..కచ్చితమైన వివరాల ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం సమర్థవంతమైన సంక్షేమ పథకాలు రూపొందించడంలో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు యాప్‌ ద్వారా స్వీయ జనగణన సైతం చేసుకోవచ్చని తెలిపారు. అధికారులు ఇళ్లకు వచ్చిన సమయంలో పూర్తి వివరాలు అందించాలని..ఎటువంటి గోప్యతకు చోటు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా బడుగు బలహీన వర్గాల జీవన స్థాయి ప్రమాణాలు, వెనుకబాటుతనం, విద్య స్థాయి, తదితర అంశాల పైన స్పష్టమైన సమాచారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పటాన్‌చెరు డిప్యూటీ కమిషనర్‌ జ్యోతిరెడ్డి, ఏఆర్‌ఓ అమరేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement