● ‘మద్దతు ధర దక్కేనా’ కథనానికిమంత్రి స్పందన ● హర్షం వ్యక్తం చేసిన మొక్కజొన్న రైతులు
వట్‌పల్లి(అందోల్): ప్రభుత్వం మొక్కజొన్న(మక్కలు) కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తుందా? మద్దతు ధర దక్కుతుందా? అని రైతులు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతుండటంపై ఈనెల 19 ‘మద్దతు ధర దక్కేనా’శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. అందోల్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటుపై మార్క్‌ఫెడ్ అధికారులకు తెలియజేశారు. డీఏసీఎంఎస్ సహకారంతో బుధవారం జోగిపేటతోపాటు అందోల్ మండలంలోని తాడ్మన్నూర్ గ్రామంలో రెండు కొనుగోలు కేంద్రాలను మార్క్‌ఫెడ్ డీఎం చంద్రశేఖర్‌గౌడ్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి ప్రారంభించారు. మొదటిసారి అందోల్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.


