ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి

Apr 30 2026 9:24 AM | Updated on Apr 30 2026 9:24 AM

జోనల్‌ కమిషనర్‌ నారాయణ్‌ అమిత్‌

రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని శేరిలింగంపల్లి జోన్‌ జోనల్‌ కమిషనర్‌ నారాయణ్‌ అమిత్‌ అధికారులను ఆదేశించారు. తెల్లాపూర్‌ డివిజన్‌లో బుధవారం క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరచాలని సూచించారు. డివిజన్‌ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థపై ఆరా తీశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పూడికతీత పనులను వేగవంతం చేయాలన్నారు. కొల్లూరులోని ప్రభుత్వ డబుల్‌ బెడ్‌ రూమ్‌ కాలనీలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలసుకున్నారు. అనంతరం చెత్త డంపింగ్‌ యార్డ్‌ను సందర్శించారు. చెత్త నిర్వహణ తీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఉప కమిషనర్‌ జ్యోతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement