న్యూస్‌రీల్
రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు సాయం చేస్తూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని తండ్రి చూపిన బాటలో పయనిస్తోంది.
వివరాలు 8లోu
సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
కంగ్టి(నారాయణఖేడ్): మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండియర్‌లో 88% విద్యార్థులు, ఫస్టియర్‌లో 67% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ బైపీసీకి చెందిన డి.భాగ్యవతి 865 మార్కులతో కాలేజీ టాపర్‌గా నిలవగా, 848 మార్కులతో ఎం.సిద్దేశ్వరీ సెకండ్ టాపర్‌గా నిలిచారు. కాగా ఫస్టియర్‌లో ఎంపీసీకి చెందిన వి.సూరజ్ 422 మార్కులతో టాపర్‌గా, బైపీసీకి చెందిన జి.అశ్విని 390 మార్కులతో సెకండ్ టాపర్‌గా నిలిచారు. వీరికి కాలేజీ ప్రిన్సిపాల్ రాంప్రసాద్‌తోపాటు లెక్చరర్లు అభినందనలు తెలిపారు.
బాలికలదే పైచేయి
సంగారెడ్డి ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. ఇంటర్ బోర్డు అధికారులు ఆదివారం ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. గతేడాది ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 60.43%తో రాష్ట్రంలో 15వ స్థానంలో నిలవగా, ప్రస్తుతం 61.59 ఉత్తీర్ణత శాతం సాధించి 19వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. గతంలో 68.85 ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 16వ స్థానంలో నిలవగా, ప్రస్తుతం 71.22 ఉత్తీర్ణత శాతం సాధించి 20వ స్థానంలో నిలిచింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ బాలికలే పై చేయి సాధించడం గమనార్హం. సంగారెడ్డిలోని అక్షయ జూనియర్ కళాశాల విద్యార్థులు అనూష, సింధూజ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 995 మార్కులు, బైపీసీ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ తుబా తహరిన్ 995 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించారు. అదేవిధంగా అక్షయ కళాశాల విద్యార్థులు మొదటి సంవత్సరం ఫలితాల్లోనూ సత్తా చాటారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరం ఫలితాలలో కీర్తన 468 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. బైపీసీ విభాగంలో అయేషా సిద్దిఖా 436 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. సెయింట్ ఆంథోనీస్ కళాశాల విద్యార్థి శృతి ప్రథమ సంవత్సరం ఎంపీసీ ఫలితాల్లో 467మార్కులు, బైపీసీ విభాగంలో సాయి మధురిమ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 437 మార్కులు సాధించి పట్టణంలో టాపర్‌గా నిలిచింది. బైపీసీ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో నందిని 995 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించింది.
ఫస్టియర్‌లోనూ బాలికలదే..
ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పరీక్షల్లోనూ బాలికల హవా కొనసాగింది. గతేడాది మాదిరిగానే ఈసారి ఫస్టియర్ ఫలితాల్లో బాలురు 49.44%ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 70.82% ఉత్తీర్ణత సాధించారు. మొత్తం పరీక్షలకు 15,896మంది హాజరు కాగా 9,791మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 6,861 మంది విద్యార్థులకు 3,392 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 9,035మందికి గానూ 6,399 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం ఒకేషన్‌ల్ విభాగంలో 63.25% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 14వ స్థానంలో నిలిచారు. 712 మంది బాలురకు 322 విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, బాలికలలో 1,152 మందికి గానూ 857మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
సెకండియర్ ఫలితాల్లోనూ..
ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోనూ బాలికలదే హవా కొనసాగింది. గతంలో సెకండియర్ ఫలితాల్లో 68.85%సాధించి రాష్ట్రంలో 16వ స్థానంలో నిలువగా, ఈసారి 71.22% ఉత్తీర్ణత సాధించి 20వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 14,290 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 10,177మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 5,827 మందికిగాను 3,575మంది ఉత్తీర్ణులు కాగా, బాలికల్లో 8,463 మందికి గానూ 6,602మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,776 మంది విద్యార్థులకు 1,260 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 701 మందికి 376 మంది ఉత్తీర్ణులు కాగా, బాలికల్లో 1,075 మందికి 884 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 19, ద్వితీయ సంవత్సరంలో 20వ స్థానం తగ్గిన ఉత్తీర్ణత శాతం


