జహీరాబాద్ టౌన్: వివాహిత అదృశ్యమైన ఘటన పట్టణంలో చోటుచేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ వినయ్‌కుమార్ వివరాల ప్రకారం... వెంకటరమణ కాలనీలో నివాసం ఉంటున్న మాలిపటేల్ కవిత(29) టైలరింగ్ చేస్తుంది. మార్చి 27న రాత్రి ఎప్పటిలాగే నిద్రపోయింది. తెల్లవారు జామున భర్త సిద్ధారెడ్డి లేచి చూడగా భార్య కనిపించలేదు. ఇంట్లో దాచిన రూ.3 లక్షలు తీసుకొని ఎవరికి చెప్పకుండా వెళ్లిపో యింది. ఆచూకీ గురించి బంధువులను విచారించినా ఫలితం లేకపోవడంతో భర్త మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీచర్స్ కాలనీలో..
జహీరాబాద్ టౌన్: మహిళ అదృశ్యమైంది. వివరాలు ఇలా... పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన సంద్ర జైపాల్ రెండో కూతురు సంద్ర జాయిషి(24)టీచర్‌గా పనిచేస్తుంది. మార్చి 28న రోజు మాదిరిగానే స్కూల్‌కు వెళ్లింది. చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో బంధువులను విచా రించినా ఆచూకీ లభించలేదు.
లైన్‌మెన్ నిర్లక్ష్యం..
వ్యక్తికి విద్యుదాఘాతంతో గాయాలు
పాపన్నపేట(మెదక్): కొడుపాక జూనియర్ లైన్‌మెన్ నిర్లక్ష్యం వల్ల ఓ అమాయకుడు విద్యుత్ షాక్‌కు గురై స్తంభంపై నుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. మాజీ సర్పంచ్ కథనం ప్రకారం... మంగళవారం గ్రామానికి చెందిన మహేశ్ ఎల్‌సీ తీసుకోగా, అమేర్ అనే వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కాడు. అయితే ఎల్‌సీ రిటర్న్ ఇవ్వక ముందే, సబ్‌స్టేషన్‌లో లైన్ ఆన్ చేశారు. దీంతో పోల్‌పై పనులు చేస్తున్న అమేర్ షాక్‌తో కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో విధులు నిర్వర్తించాల్సిన జేఎల్‌ఎం గోపాల్ , విధులకు రాకుండా వేరే వ్యక్తులను నియమించుకొని పనులు చేయిస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. లైన్‌మెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.


