డాడీస్ రోడ్ క్యూఆర్ స్టిక్కర్‌ను ప్రారంభించిన డీఎస్పీ
తూప్రాన్: వాహనదారులు తప్పనిసరిగా డాడీస్ రోడ్ క్యూఆర్ స్టిక్కర్‌ను ఉపయోగించుకోవాలని డీఎస్పీ నరేందర్‌గౌడ్ అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో స్టిక్కర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రమాద సందేశం, రక్త నిధి, పార్కింగ్ సమస్య, పత్రములు భద్రపరచుట, రిమైండర్లు, లాక్ హెచ్చరిక, టోయింగ్ హెచ్చరిక, లాంటి ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనిషి ప్రాణాలు కాపాడడంలో, వాహనదారులకు ‘డాడీస్ రోడ్ యాప్’ ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా తూప్రాన్ డిస్ట్రిబ్యూటర్ యంజాల స్వామిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తుప్రాన్ సీఐ రంగకృష్ణా, నర్సాపూర్ సీఐ జానారెడ్డి, ఎస్‌ఐలు గంగరాజు, మధుకర్ రెడ్డి, టి.రాజు సుభాష్ గౌడ్ , డాడీస్ రోడ్ టీమ్ సభ్యులు రామస్వామి, భిక్షపతి, నగేశ్, స్వామి, దీప్తిక, సంకీర్తన, సుష్మిత పాల్గొన్నారు.


