పాల్గొన్న అంతర్రాష్ట్ర మల్లయోధులు
న్యాల్‌కల్(జహీరాబాద్): మండల పరిధిలోని డప్పూర్ గ్రామ శివారులో గల ఉర్సె షరీప్ హజ్రత్ పీర్‌గైబ్ సాహెబ్ ఖిబ్లా రెహమతుల్లా అలై దర్గా జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. ఉదయం ప్రారంభమైన కుస్తీ పోటీల్లో జిల్లా నుంచి, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన మల్లయోధులు పాల్గొన్నారు. పైల్‌వాన్‌ల కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. పోటీల్లో సుమారు 40 మంది మల్లయోధులు పాల్గొన్నారు. మహారాష్ట్ర నాందేడ్‌కు చెందిన సిద్ధూ చెలాంగిని మొదటి బహుమతి దక్కించుకున్నాడు. గెలుపొందిన వారికి ఐదు తులాల వెండి కడియాన్ని మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కిరణ్ గౌడ్ అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు, పైల్‌వాన్‌లు పాల్గొన్నారు.


