వర్సిటీలో హార్టీ ఇన్నోవేషన్‌ హబ్‌ | - | Sakshi
Sakshi News home page

వర్సిటీలో హార్టీ ఇన్నోవేషన్‌ హబ్‌

Apr 1 2026 8:30 AM | Updated on Apr 1 2026 8:30 AM

ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ డి.రాజిరెడ్డి

ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ డి.రాజిరెడ్డి

ములుగు(గజ్వేల్‌): ఉద్యాన రంగంలో పరిశోధనలను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో హార్టీ ఇన్నోవేషన్‌ హబ్‌ స్థాపనకు చర్యలు చేపడుతున్నట్లు వర్సిటీ వీసీ డి.రాజిరెడ్డి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాన్ని ఏఎన్‌జీఆర్‌ఏయూ మాజీ వీసీ డాక్టర్‌. సురవరం సుధాకర్‌రెడ్డి, అమెరికాలోని ప్లోరిడా నాచురల్‌ రిసోర్సెస్‌ యూనివర్సిటీ డైరెక్టర్‌ కె.రమేశ్‌రెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారితో ఫ్యాకల్టీ ఎక్చేంజ్‌ ప్రోగ్రాంలు, సహకార పరిశోధన ప్రాజెక్టులపై వీసీ చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హార్టీ ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశోధన అవకాశాలు లభిస్తాయని, విద్యార్థులు, అధ్యాపకులకు ప్రపంచ స్థాయి పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అలాగే ఉద్యాన రంగంలో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లు ప్రోత్సహించబడుతాయన్నారు. కార్యక్రమంలో వర్సిటీ అధికారులు, బోధన సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement