రంజాన్‌ మాసం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

రంజాన్‌ మాసం ప్రారంభం

Feb 19 2026 11:01 AM | Updated on Feb 19 2026 11:01 AM

రంజాన్‌ మాసం ప్రారంభం

రంజాన్‌ మాసం ప్రారంభం

సంగారెడ్డి క్రైమ్‌: ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. స్వీయ సంస్కారం, తోటి మనుషులపై సోదర భావం, ప్రేమ, కరుణ ప్రత్యేక రంజాన్‌ మాసం నేర్పే లక్షణాలు. పిల్లలనుంచి పెద్దవాళ్ల వరకు కఠోర నియమాలతో ఉపవాస దీక్షలు చేస్తారు. బుధవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో ఈనెల 19వ తేదీ తెల్లవారుజామున మొదటి ఉపవాస దీక్షకు సిద్ధమవుతున్నారు. ఉదయాన్నే అన్న పానీయాలను సేవించడాన్ని సహారా అంటారు. సాయంత్రం ఉపవాస దీక్ష విరమించి భోజనం చేయడానికి ఇఫ్తార్‌ అంటారు. రంజాన్‌ పవిత్ర మాసంలో నమాజుల కోసం ఇప్పటికే మసీదులను సిద్ధం చేశారు. ఉపవాస దీక్ష విడిచే సమయం కోసం పట్టణాలలో, గ్రామాల్లో ఇప్పటికే వంటకాలు అందించేందుకు పలు హోటళ్లు సిద్ధమయ్యాయి. ఈ నెల రోజులపాటు ఉపవాస దీక్షలు చేపట్టి మళ్లీ సాయంత్రం ఆకాశంలో నెలవంక చూసి మరుసటి రోజు ఉదయాన్నే రంజాన్‌ పండుగ జరుపుకొంటారు.

ముస్లిం సోదరులకు అతి పవిత్రం మాసం

దివ్య ఖురాన్‌ గ్రంథం దివి నుంచి భువికి ఈ మాసంలోనే వచ్చిందని వారు విశ్వసిస్తారు. దానం చేయడం..ధర్మం ఆచరించడమే జగత్‌. సంపన్నులు ముస్లిం వారి ఆదాయం నుంచి కనీసం20–30% ధనాన్ని నిరుపేదల అభ్యున్నతికి వినియోగించాలనేది నియమం. పేదలను ఆదుకునే దానధర్మాలను ఆచరించడం ఈ మాసం ప్రత్యేకత.

30 రోజులు మూడు భాగాలుగా

రంజాన్‌ మాసంలో 30 రోజులను మూడు భాగాలుగా విభజిస్తారు. మొదటి పది రోజులు రహమత్కే రోజాలు (కరుణ చూపించే దినాలు), రెండో పది రోజులు మాకు విరత్‌ కె (పాపాల నుంచి క్షమాపణలు పొందిన దినాలు), చివరి పది రోజులు జహున్నుమూసే చూట్కారే రోజాలు (నరక దండన నుంచి విముక్తి కోరే దినాలు) పాటిస్తారు.

గురువారం తొలి ఉపవాసం

నెలపాటు ఉపవాస దీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement