ప్రజాసేవలో ఆదర్శంగా నిలవండి | - | Sakshi
Sakshi News home page

ప్రజాసేవలో ఆదర్శంగా నిలవండి

Feb 19 2026 11:01 AM | Updated on Feb 19 2026 11:01 AM

ప్రజాసేవలో ఆదర్శంగా నిలవండి

ప్రజాసేవలో ఆదర్శంగా నిలవండి

సదాశివపేట(సంగారెడ్డి): మున్సిపల్‌ కార్యాలయంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి స్పష్టం చేశారు. నూతన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మునిపల్లి అంజమ్మ, వైస్‌ చైర్‌పర్సన్‌ రేణుకతో కలిసి నిర్మలారెడ్డి సమక్షంలో బుధవారం పదవీబాధ్యతలు స్వీకరించారు. యూఐడీఎఫ్‌ పథకం కింద రూ.18.75 కోట్ల విలువైన 56 అభివృద్ధి పనులకు ప్రతిపాదనలపై నూతన చైర్‌పర్సన్‌ అంజమ్మ సంతకం చేశారు. ఈ సందర్భంగా రంజాన్‌ పండుగ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మలారెడ్డి మాట్లాడుతూ...ప్రజల విశ్వాసాన్ని వమ్ముచేయకుండా వారికి అందుబాటులో ఉండి మంచిపాలన అందించాలన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్‌ రాంరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శివాజీ, కౌన్సిలర్లు శంకర్‌గౌడ్‌, అరుణ్‌కుమార్‌, నర్సింహులు, రోజా పట్లూరి, లక్ష్మి ప్రియామార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు కందికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement