నార్త్ ఈస్ట్ కేఫ్‌లో మద్యం సిట్టింగ్
కేసు నమోదు చేసిన పోలీసులు
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై నార్త్ ఈస్ట్ కేఫ్‌లో మద్యం సిట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీస్‌లు పట్టుకున్నారు. ఎస్‌ఐ సృజన కథనం మేరకు...నార్సింగి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన నార్త్ ఈస్ట్ కేఫ్‌లో అక్రమంగా మద్యం సిట్టింగ్ నిర్వహిస్తున్నారని నమ్మదగిన సమాచారంతో గురువారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. దీంతో మద్యం తాగుతున్న వ్యక్తులు పరారీ కాగా పంచనామా నిర్వహించి నిర్వాహకులు చంద్రారెడ్డి కుమారుడు రవీందర్‌రెడ్డి, దొంతి మహేష్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఎవరైన అక్రమ మద్యం విక్రయాలు చేసినా, మద్యం సిట్టింగ్ నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.


