చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నర్సాపూర్ రూరల్ : చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని విఠల్ తండాకు చెందిన నున్సావత్ భిక్షపతి (48) వ్యవసాయంతో పాటు కుటుంబ అవసరాలకు అప్పులు చేశాడు. దీంతో మనస్తాపం చెంది ఈనెల 28న పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్యాపిల్లలు ఉన్నారు.
చెరువులో గల్లంతైన వ్యక్తి
మృతదేహం వెలికితీత
వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని మహ్మద్‌నగర్ తండా శివారులోని చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని వెలికితీశారు. ఎస్సై రాజు కథనం ప్రకారం.. మహ్మద్‌నగర్ తండాకు చెందిన రమావత్ గోపాల్ (37) రెండు రోజుల క్రితం గ్రామ సమీపంలోని చెరువులో చేపల వేటకు వెళ్లాడు. గురువారం సాయంత్రం చెరువు గట్టుపై బట్టలు, చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యమైనట్లు తెలిపారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
సంగారెడ్డి టౌన్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం పసల్వాది గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు స్కూటీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న అల్లాదుర్గం మండలం ముస్తాపూర్కు చెందిన సత్యనారాయణ(20) అక్కడికక్కడే మృతి చెందారు. స్కూటీ వెనకాల కూర్చున్న మరో వ్యక్తి కొత్త గొల్ల కుమార్ (18)కు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
గుర్తు తెలియని శవం లభ్యం
హత్నూర ( సంగారెడ్డి): గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించిన సంఘటన హత్నూర మండలం బోరుపట్ల గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. బోరుపట్ల గ్రామ శివారులోని పత్తి కుంట చెరువులో ఒక వ్యక్తి శవం నీటిలో తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అతని వయసు సుమారు( 40) సంవత్సరాల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎవరైనా గుర్తు పడితే హత్నూర పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్ 8712656752కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు.
22 మంది బైండోవర్
సంగారెడ్డి క్రైమ్: సంగారెడ్డిలోని 22 మంది పాత నేరస్తులను తహసీల్దార్ జయరాం ఎదుట శుక్రవారం బైండోవర్ చేసినట్లు పట్టణ సీఐ రాము నాయుడు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పాత నేరచరిత్ర కలిగిన నేరస్తులను ముందస్తుగా బైండోవర్ చేసినట్లు చెప్పారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు చట్టపరమైన చర్యలు తీసుకుంటునట్లు వివరించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
30ఎండికె 62ఏ:
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి


