పారా అథ్లెటిక్స్‌లో నాలుగు పతకాలు
నవోదయ విద్యార్థుల ప్రతిభ
వర్గల్(గజ్వేల్): ఎనిమిదో రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలలో వర్గల్ నవోదయ విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగు పతకాలు సాధించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా తెలంగాణ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన ఈ పోటీలలో వర్గల్ నవోదయ విద్యార్థులు ఎం వివేక్, బీ కార్తీక్ పాల్గొన్నారు. 100 మీటర్ల పరుగులో సత్తాచాటిన వివేక్ గోల్డ్‌మెడల్, షాట్‌పుట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించగా, కార్తీక్ జావెలిన్ త్రోలో గోల్డ్, హైజంప్‌లో సిల్వర్ మెడల్ సాధించినట్లు వర్గల్ నవోదయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్, పీఈటీ వీరేందర్‌సింగ్ తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు.


