రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం
రాయికోడ్(అందోల్): మండలంలోని శంశోద్దీన్‌పూర్ శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఎస్‌ఐ చైతన్య కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుసునూర్‌కి చెందిన ఆటో డ్రైవర్ మల్లారెడ్డి (30) తన ఆటోలో చిమ్నాపూర్ నుంచి న్యాల్‌కల్ మండలం హద్నూర్ వెళ్తున్నాడు. అయితే శంశోద్దీన్‌పూర్ గ్రామ శివారుకు రాగానే ఎదురుగా వస్తున్న కారు ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో నడుపుతున్న మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


