గణతంత్రంలో ‘వర్గల్‌’ రెపరెప | - | Sakshi
Sakshi News home page

గణతంత్రంలో ‘వర్గల్‌’ రెపరెప

Jan 27 2026 9:38 AM | Updated on Jan 27 2026 9:38 AM

గణతంత

గణతంత్రంలో ‘వర్గల్‌’ రెపరెప

పరేడ్‌లో కమాండర్‌గా ఆకాంక్ష

గవర్నర్‌ నుంచి కప్పు స్వీకరణ

హైటెక్స్‌లో సామూహిక జెండావిష్కరణ

వర్గల్‌(గజ్వేల్‌): గణతంత్ర వేడుకల్లో మండలంలోని పూలే బాలికల గురుకులం మెరిసింది. సోమవారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ విద్యార్థులు పరేడ్‌లో సత్తా చాటగా, హైదరాబాద్‌ హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ‘2026 జాతీయ పతాకాల ఆవిష్కరణ’ కార్యక్రమంలో 96 మంది ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీ విద్యాలయం తరపున 55 మంది ఎన్‌సీసీ క్యాడెట్లతో కూడిన బృందానికి గురుకుల విద్యార్థిని ఆకాంక్ష కమాండర్‌గా నాయకత్వం వహించగా, విద్యార్థులు ఎమ్‌ మోక్ష, ఎమ్‌ శిరీష, ఎమ్‌ రక్షిత, బీ.దివ్య, బీ.హర్షిత, ఎన్‌ భావనశ్రీ, ఎమ్‌ రుచిత, ఎస్‌ హర్షవందిని, బీ.లక్షితారాజ్‌ పరేడ్‌లో పాల్గొన్నారు. వీరి నుంచి రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జూనియర్‌ విభాగం నుంచి ఉత్తమ పరేడ్‌ అవార్డును దక్కించుకుని, గవర్నర్‌ చేతుల మీదుగా కమాండర్‌ ఆకాంక్ష కప్పును స్వీకరించారు. పూలే గురు కుల అసోసియేట్‌ ఎన్‌సీసీ ఆఫీసర్‌ లావణ్య ఆధ్వ ర్యంలో 96 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ‘ఇండియా బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌’ 2026 పతాకాల ఆవిష్కరణలో పాల్గొని పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు సాధించారు. విద్యార్థులు సత్తా చాటడంపై పూలే గురుకుల ప్రిన్సిపాల్‌ లక్ష్మిదేవి, అధ్యాపకులు,సిబ్బంది అభినందనలు తెలిపారు.

హైటెక్స్‌లో జెండా ఆవిష్కరణలో

పూలే గురుకుల విద్యార్థులు

గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ నుంచి కప్పును

స్వీకరిస్తున్న విద్యార్థి ఆకాంక్ష

ప్రతిభ చాటి.. బహుమతులు గెలిచి

పటాన్‌చెరు టౌన్‌ : ముత్తంగి డివిజన్‌ పరిధిలోని విశ్వభారతి లా కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. తెలంగాణ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి రీల్‌ మేకింగ్‌ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. వీరికి సోమవారం రాష్ట్ర హైకోర్టులో జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకల్లో రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ బహుమతిని అందజేశారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అనేక లా కాలేజీల విద్యార్థులు పాల్గొనగా, విశ్వ భారతి లా కళాశాల విద్యార్థులు నిర్వహించిన రీల్‌ సృజనాత్మకత, సామాజిక అవగాహనకు ప్రశంసలు లభించాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ భవాని,గైడ్‌ అధ్యాపకురాలు రమ్య, అధ్యాపకుల బృందం విద్యార్థులను అభినందించారు. ఈ పోటీల్లో విద్యార్థులు సంతోష్‌ కుమార్‌, సుమలత, లావణ్య, సూర్య వరప్రసాద్‌, ఆశ, రావు, నవ్య, గౌతమ్‌, విక్టోరియా రాణి, మాస్టర్‌ మోక్షిత, మాస్టర్‌ పరమేశ్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి

బహుమతులు ప్రదానం

గణతంత్రంలో ‘వర్గల్‌’ రెపరెప1
1/2

గణతంత్రంలో ‘వర్గల్‌’ రెపరెప

గణతంత్రంలో ‘వర్గల్‌’ రెపరెప2
2/2

గణతంత్రంలో ‘వర్గల్‌’ రెపరెప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement