పరేడ్‌లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
నర్సాపూర్: సోమవారం సికింద్రాబాద్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబర్చారని స్థానిక అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కిశోర్ తెలిపారు. పరేడ్‌లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా వారికి జూనియర్ విభాగంలో ద్వితీయ బహుమతి వచ్చిందన్నారు. కాగా విద్యార్థులను రాష్ట్ర గిరిజన గురుకులాల సంక్షేమ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి అభినందించారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రిన్సిపాల్‌తోపాటు ఉపాధ్యాయులు బసవరాజు, ఎన్‌సీసీ ఇన్‌చార్జ్ రవి తదితరులు అభినందించారు.


