మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
77వ గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ ప్రావీణ్య పరేడ్‌గ్రౌండ్‌లో పోలీసువందనం స్వీకరణ అధికారులకు ప్రశంసా పత్రాలుఅందజేత
విజన్ 2047 స్ఫూర్తితో సాగుదాం
సంగారెడ్డి జోన్: తెలంగాణ రైజింగ్–2047 విజన్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించి జిల్లాను ప్రగతి పథంలో ముందుకు నడిపించాలని కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. జిల్లా ఎస్పీ కార్యాలయ ఆవరణలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో సోమవారం ఘనంగా నిర్వహించిన 77వ గణతంత్ర వేడుకలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్లు పాండు, మాధురి, ఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, అదనపు ఎస్పీ రఘునందన్‌రావు వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శకటాల ప్రదర్శన శాఖల వారీగా ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం కలెక్టర్ ప్రజలనుద్దేశించి ప్రసగించారు. వివరాలు ఆమె మాటల్లోనే..‘‘సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా 14,723 ఇళ్లు మంజూరయ్యాయి. 6,300 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. రూ.163 కోట్ల మేర బిల్లులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేశాం. రైతు భరోసా పథకం ద్వారా వ్యవసాయానికి ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తుంది. జిల్లావ్యాప్తంగా 2025 వానాకాలం సీజన్‌లో 3,58,863 మంది రైతులకు రూ.422 కోట్లను ప్రభుత్వం జమ
చేసింది.
మహిళా సంఘాలకు రుణాలు
కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఈ ఏడాది 8,202 సంఘాలకు రూ.771 బ్యాంకు లింకేజీ రుణాలు, సీ్త్ర నిధి ద్వారా చిన్న సంఘాలకు రూ. 87.47 కోట్లను, 15 వేల సంఘాలకు రూ.36.24కోట్ల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం మంజూరు చేసింది. నాగలిగిద్ద గుమ్మడిదల మండలాల్లో రూ. 3 కోట్ల వ్యయంతో సోలార్ ప్లాంట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పోటీ పరీక్షలు రాసే అంధవిద్యార్థుల కోసం రూ.35 లక్షలతో జిల్లా గ్రంథాలయ ఆవరణలో డిజిటల్ సౌండ్ లైబ్రరీని ఇటీవలే ప్రభుత్వం ప్రారంభించింది.
నారాయణఖేడ్: విద్యతోపాటు క్రీడల్లోనూ ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. గాంధీచౌక్‌లో ఎంపీ సురేశ్ షెట్కార్, ఇందిరాచౌక్, క్యాంపు కార్యాలయం, తహసీల్‌గ్రౌండ్‌లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, బీఆర్‌ఎస్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, శివరావుషెట్కార్‌చౌక్‌లో నగేశ్ షెట్కార్, రాజీవ్‌చౌక్‌లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్ షెట్కార్ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఖేడ్‌లోని అప్పారావుషెట్కార్ మెమోరియల్ స్టేడియంలో పట్టణంలోని గురుకులాలు, విద్యార్థులకు క్రీడాపోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు తదితర అంశాలపై పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. అన్ని శాఖలకు సంబంధించి ఉత్తమ అధికారులను ఎంపిక చేసి అవార్డులను అందజేశారు.
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందాం
మున్సిపాలిటీ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని సురేశ్ షెట్కార్, సంజీవరెడ్డి కోరారు.
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026


