ఇ–బ్యాటరీ సైకిల్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఇ–బ్యాటరీ సైకిల్‌ ఆవిష్కరణ

Jan 27 2026 9:37 AM | Updated on Jan 27 2026 9:37 AM

ఇ–బ్యాటరీ సైకిల్‌ ఆవిష్కరణ

ఇ–బ్యాటరీ సైకిల్‌ ఆవిష్కరణ

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): పర్యావరణహిత రవాణ దిశగా మరో కీలక అడుగుపడింది. మండలంలోని ఆత్మకూర్‌ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి సాయికిరణ్‌ పర్యావరణ రహిత బ్యాటరీ సైకిల్‌ను రూపొందించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఎంఈవో శంకర్‌ చేతుల మీదుగా ఆ సైకిల్‌ను ఆవిష్కరించారు. ఈ బ్యాటరీ సైకిల్‌ తక్కువ ఖర్చుతో, ఇంధనాన్ని వినియోగించకుండా, రోజువారీ ప్రయాణాలకు అనువుగా రూపొందించాడు. ఇది వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో తోడ్పడటంతోపాటు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడనుంది. ఈ బ్యాటరీ సైకిల్‌ ఆవిష్కరణకు స్థానికంగా మంచి స్పందన లభిస్తోంది. ఈ వినూత్న ఆవిష్కరణకు గ్రామానికి చెందిన యువకుడు ఇందూరి రమేశ్‌ అందించిన స్పాన్సర్‌షిప్‌, సహకారం ఎంతో తోడ్పడిందని సాయికిరణ్‌ చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement