బ్లూ కోర్ట్ పోలీసులకు తీవ్రగాయాలు
త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
అక్కన్నపేట(హుస్నాబాద్): విధి నిర్వహణలో భాగంగా గ్రామాలు తిరుగుతున్న బ్లూ కోర్ట్ పోలీసులు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంద విజయ్(కానిస్టేబుల్), ముడావత్ తిరుపతి(హోంగార్డు) వీరిద్దరూ బ్లూ కోర్ట్ విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం ఓ నేరస్తుడిన్ని పట్టుకునేందుకు బైక్‌పై వెళ్లుతున్న క్రమంలో శ్రీరాంతండా గ్రామ పరిధిలో బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. కానిస్టేబుల్ హెల్మెట్ ధరించి ఉండడంతో త్రుటిలో ప్రాణపాయం తప్పిందని ప్రత్యేక సాక్ష్యులు తెలిపారు. 108అంబులెన్స్ సహాయంతో హుస్నాబాద్‌కు తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.


