సమస్యలన్నిటికీ సోషలిజమే అంతిమ పరిష్కారం
సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ప్రజా సమస్యలకు సోషలిజమే అంతిమ పరిష్కారమని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని కేవల్‌కిషన్ భవన్‌లో లెనిన్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం జయరాజు మాట్లాడుతూ.. లెనిన్ ప్రపంచంలో దోపిడీ రాజ్యాలను కూల్చి కార్మిక వర్గ రాజ్యాల ఏర్పాటు ద్వారానే విముక్తి సాధ్యం అవుతుందని భావించి సోషలిస్టు వ్యవస్థను స్థాపించారని గుర్తు చేశారు. కార్మిక వర్గ నాయకత్వంలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.కార్పొరేట్, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ నాయకులు వాజిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.


