ఆవిష్కరణలు.. అద్భుతం | - | Sakshi
Sakshi News home page

ఆవిష్కరణలు.. అద్భుతం

Jan 22 2026 9:56 AM | Updated on Jan 22 2026 9:56 AM

ఆవిష్

ఆవిష్కరణలు.. అద్భుతం

నమూనాలను చూసేందుకు

వచ్చిన విద్యార్థులు

రామచంద్రాపురం(పటాన్‌చెరు): మండల పరిధిలోని వెలిమెల గాడియం ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన– 2026కు విద్యార్థులు పోటెత్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన నమూనాలు ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. బుధవారం ఏడు జిల్లాల నుంచి 187 పాఠశాలలకు చెందిన సుమారు పది వేల విద్యార్థులు ప్రదర్శనను సందర్శించారు. విద్యార్థులను శాస్త్రవేత్తలుగా మార్చేందుకు ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడుతాయని పలువురు అభిప్రాయపడ్డారు.

వజ్ర జాకెట్‌ నమూన బాగుంది

ప్రదర్శనలో అనేక కొత్త విషయాలు తెలుసుకున్నాం. ప్రదర్శన నమూనాల గూర్చి తోటి విద్యార్థులకు వివరిస్తాను. ప్రధానంగా నాకు వజ్ర జాకెట్‌ నమూనా చాలా నచ్చింది. అలాగే కేరళ రాష్ట్రానికి చెందిన ఎగ్జిబిట్‌లు బాగున్నాయి. – అనామిక,

పదవ తరగతి, జెడ్పీపీహెచ్‌ఎస్‌, దౌల్తాబాద్‌

సైన్స్‌పై మరింత ఆసక్తి

కొత్త నమూనాలను చూడటం వల్ల సైన్స్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఎగ్జిబిట్‌ పెట్టిన వారు నమూనాల గురించి క్షుణ్ణంగా వివరించారు. మొత్తంగా ప్రదర్శన బాగుంది.

– ఉపేందర్‌, పదవ తరగతి,

జడ్పీహెచ్‌ఎస్‌, హాలియా, నల్గొండ

చాలా విషయాలు తెలుసుకున్నాం

వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించడం చాలా ఆనందంగా ఉంది. కొత్త ప్రయోగ నమూనాలను చూశాం. ఇక్కడ తెలుసుకున్న విషయాలు భవిష్యత్తులో ఉపయోగపడుతాయి. మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వలేదు.

– అభిలాష్‌,

8వతరగతి, జెడ్పీహెచ్‌ఎస్‌, పొతిరెడ్డిపల్లి

ఆవిష్కరణలు.. అద్భుతం1
1/3

ఆవిష్కరణలు.. అద్భుతం

ఆవిష్కరణలు.. అద్భుతం2
2/3

ఆవిష్కరణలు.. అద్భుతం

ఆవిష్కరణలు.. అద్భుతం3
3/3

ఆవిష్కరణలు.. అద్భుతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement