24 నుంచి లింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

24 నుంచి లింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

Jan 22 2026 9:56 AM | Updated on Jan 22 2026 9:56 AM

24 ను

24 నుంచి లింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

హత్నూర (సంగారెడ్డి): రాష్ట్రంలోనే రెండోవ స్పటిక లింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందిన హత్నూర మండలం దౌల్తాబాద్‌లోని భవాని స్పటిక లింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబైంది. ఈ నెల 24న శనివారం ఆలయ వార్షికోత్సవం సందర్భంగా సుప్రభాత సేవ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, గణపతి పూజ, పుణ్యాహవచనం, రుద్రచండీ హోమం, పూర్ణాహుతి, సాయంత్రం అగ్నిగుండాలు, బండ్ల జాతర ఊరేగింపు, తదితర ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించనున్నారు. 25న రెండో రోజు ఆదివారం ఉదయం స్పటిక లింగేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, శివపార్వతుల కల్యాణోత్సవం అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

23న ఓంకారేశ్వర ఆశ్రమ వార్షికోత్సవం.

సిరిపురం గ్రామ శివారులోని ఓంకారేశ్వర ఆశ్రమం ఆలయ వార్షికోత్సవం ఈ నెల 23న నిర్వహించనున్నట్లు ఆశ్రమపీఠాధిపతి దేవదాసు స్వామి తెలిపారు. ఓంకారేశ్వర ఆశ్రమం 22వ తేదీ సాయంత్రం పల్లకి సేవ నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరై మాతామణికేశ్వరి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

14 ఏళ్లుగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాం

14 ఏళ్లుగా భవాని స్పటిక లింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాం. ఈ ఆలయంలో ప్రత్యేకంగా స్పటికంతో చేసిన శివలింగాన్ని ప్రతిష్టించడం విశేషం. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. – ప్రదీప్‌ శర్మ, ఆలయ పూజారి

24 నుంచి లింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు1
1/2

24 నుంచి లింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

24 నుంచి లింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు2
2/2

24 నుంచి లింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement